Sunday, November 24, 2024
Homeచిత్ర ప్రభWhy Tollywood so angry on CM Revanth?: రేవంత్ పై టాలీవుడ్ కు...

Why Tollywood so angry on CM Revanth?: రేవంత్ పై టాలీవుడ్ కు కోపమెందుకు?

టాలీవుడ్ Vs రేవంత్

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సినీ ప్రముఖులు రేవంత్ బర్త్ డేకు ఒక్క ట్వీట్ కూడా చేయకపోవటం అందరినీ విస్మయపరుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ కు తెలుగు సినీ ప్రముఖులెవ్వరూ ఎందుకు అండగా లేరన్నది ఇప్పుడు తెలుగు వారికి ఆసక్తిగొలిపే విషయంగా మారింది.

- Advertisement -

తొలి నుంచీ ఇంతే..
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుతీరినప్పటి నుంచీ తెలుగు చిత్రపరిశ్రమ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పటం మొదలు, సినిమా ఇండస్ట్రీ మంత్రి కోమటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేవరకూ తెలుగు సినిమా ప్రముఖులు ఎవ్వరూ ఏ విషయంలోనూ చొరవ తీసుకోలేదు. సినిమాటోగ్రఫీ మంత్రిగా గత సర్కారు హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ స్థాయిలో సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేశారో మనందరికీ గుర్తుంది. మరి నిన్న తలసానితో నేడు కోమటిరెడ్డితో టాలీవుడ్ వ్యవహార శైలి ఎలా ఉందన్న విషయం అందరికీ నిత్యం కనిపిస్తూనే ఉంది.

చిరంజీవి తొలి అడుగు..
ఈ విషయాలన్నింటిలోనూ కాస్తో కూస్తూ తొలి అడుగు వేసింది చిరంజీవి మాత్రమే. అటు ఆంధ్రప్రదేశ్ లో తమ సర్కారు వచ్చిందనే సంతోషంలో ఉన్న టాలీవుడ్ పరిశ్రమ రేవంత్ సర్కారును మాత్రం కేర్ చేయటం లేదని గట్టిగా విమర్శ వినిపిస్తోంది. ఆఖరుకి సీఎం రేవంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సైతం టాలీవుడ్ ఆసక్తి చూపలేదు. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ తన ట్వీట్ లో చెప్పటంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది.

పదేళ్లు బీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు..
కేసీఆర్ సర్కారు అధికారంలోకి రాగానే గురుకుల ట్రస్ట్ భూములు, అన్నపూర్ణ స్టూడియో లీజు వ్యవహారాలు, ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమ నిర్మాణం వంటి విషయాలు మొత్తం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపాయి. దీంతో తక్షణం కేసీఆర్ ఫ్యామిలీకి టాలీవుడ్ తలవొంచి, సంధి చేసుకుంది. ఇక ప్రొడ్యూసర్ గా కవిత టాలీవుడ్ లో ప్రత్యక్ష సంబంధాలు నెరిపారని అప్పట్లోనే సినీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. టాలీవుడ్ ప్రముఖులపై వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చి ట్వీట్లు, కామెంట్స్ తమకు అనుకూలంగా కేసీఆర్ సర్కారు చేయించుకుందనే టాక్ ఉండనే ఉంది. ఇదంతా చాలదన్నట్టు డ్రగ్స్ మాఫియా విచారణ పేరుతో బీఆర్ఎస్ కు టాలీవుడ్ పూర్తిగా సరెండర్ అయిపోయిందని ఇండస్ట్రీలోని ఓ వర్గం కోడై కూసింది.
ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తమ ఆస్తులు, వ్యాపారాలు ఏమవుతాయో అన్న భయంతో వణికిపోయిన టాలీవుడ్ ప్రముఖులు ఆతరువాత పదేళ్లపాటు గులాబీ పార్టీతో చక్కని సాన్నిహిత్యాన్ని నెరిపాయన్నది బహిరంగ రహస్యం. బీఆర్ఎస్ సర్కారులోని పెద్దలు, పార్టీ నేతలు అందరూ టాలీవుడ్ తో రాసుకుపూసుకు తిరిగారు. సర్కారు అండదండతో తమ పనులను టాలీవుడ్ ప్రముఖులంతా చక్కబెట్టుకున్నారని ఫిలిం నగర్ లో టాక్.

సీన్ మారగానే..
రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని అంచనాల్లో ఉన్న టాలీవుడ్ అంచనాలు తలకిందలై, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలుగు సినీ ప్రముఖులు షాక్ తిన్నారు. ఈనేపథ్యంలో అసలు రేవంత్ సర్కారును వీరు ఏ విషయంలోనూ పరిగణలోకి తీసుకోలేదని ఇండస్ట్రీకి చెందిన కొందరు బాహాటంగా విమర్శిస్తున్నారు. కానీ తమ సినిమాల రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లపై మాత్రం కొందరు ప్రముఖులు సీఎంను కలిసి తమ పని జరుపుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు బండ్ల గణేష్ చెబుతున్నది కూడా అదే. కేవలం టికెట్ల రేట్ల పెంపు కోసమే సీఎం కావాలని టాలీవుడ్ పై బండ్ల ట్వీట్ చేశారు. ఇది అక్షర సత్యం అని కాంగ్రెస్ నేతలు సైతం వాదిస్తున్నా, టాలీవుడ్ మాత్రం స్పందించటం లేదు. నంది అవార్డులు-గద్దర్ అవార్డులపై రేవంత్ సర్కారు చొరవ తీసుకునేందుకు రెడీ అని పదేపదే చెబుతున్నా టాలీవుడ్ లో వీటిపై ఆసక్తి లేక నామమాత్రంగా స్పందించటం విశేషం.

తమ సామాజిక వర్గమే కదా
టాలీవుడ్ లో కమ్మ-కాపు సామాజిక వర్గానికి చెందిన సర్కారు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాగానే సంబరాలు జరుపుకున్నారు. డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకు టాలీవుడ్ లోని అన్ని స్థాయిల వారు పోటీపడి పవన్ కు బర్త్ డే విషెస్ చెప్పటం మొదలు ట్వీట్ల వరకు అన్నీ చేశారు. అదే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ సీన్ రివర్స్, సీఎం రేవంత్ మొదలు ప్రభుత్వం-పార్టీలోని వారెవ్వరినీ టాలీవుడ్ లెక్కచేయటం లేదనే విమర్శలున్నాయి. దీనికంతా కారణం టాలీవుడ్ లోని కొన్ని సామాజిక వర్గాల పెద్దరికమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News