Friday, November 15, 2024
HomeతెలంగాణPonguleti Srinivas | భూముల పరిరక్షణకై పొంగులేటి కీలక ఆదేశాలు

Ponguleti Srinivas | భూముల పరిరక్షణకై పొంగులేటి కీలక ఆదేశాలు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ భూముల పరిరక్షణకు పట్టిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూముల సర్వే చేపట్టి హద్దులను గుర్తించి సంరక్షించాలని మంత్రి అధికారులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్వే నిర్వహించిన వివరాలను రికార్డు రూపంలో సమర్పించాలన్నారు. వరి ధాన్యం, పత్తి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు నష్టపోకుండా పంటల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్ముకోవాలని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు సంబంధించి నిర్వహణ తీరును అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సర్వే లక్ష్యాలను ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించి సర్వేలో భాగస్వాములను చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News