Saturday, November 16, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: తమ్ముడు మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన

CM Chandrababu: తమ్ముడు మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన

CM Chandrababu| సీఎం చంద్రబాబు తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికి తెలియచేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.” అని ట్వీట్ చేశారు.

- Advertisement -

మంత్రి నారా లోకేష్ కూడా తన బాబాయ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు గారి మృతి తీవ్ర విషాదం నింపింది. చిన్నాన్న‌తో చిన‌నాటి నా అనుబంధం క‌ళ్ల ముందు క‌దిలి వ‌చ్చిన క‌న్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. మౌన‌మునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి క‌నిపించే ధైర్యం..నేటి నుంచి చిర‌కాల జ్ఞాప‌కం. చిన్నాన్న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. అంతులేని దుఃఖంలో ఉన్న త‌మ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాల‌ని కోరుతున్నాను.” అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News