Sunday, November 17, 2024
HomeTS జిల్లా వార్తలుమహబూబ్ నగర్Jadcharla: సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల కృషి గణనీయం

Jadcharla: సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల కృషి గణనీయం

ప్రజల సేవలో జర్నలిస్టులు..

సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా అణగారిన వర్గాల తరుపున పోరాడుతున్న జర్నలిస్టుల కృషి సమ సమాజ నిర్మాణంలో ఎంతో గణనీయమని జడ్చర్ల శ్రీ రంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి అన్నారు.

- Advertisement -

శనివారం జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్చర్ల శ్రీ రంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాధిక రాంరెడ్డి దంపతులు అంబేద్కర్ కళా భవన్ లో జడ్చర్ల జర్నలిస్టులను శాలువాలతో ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలను పంచిపెట్టారు.

ఈ సందర్భంగా కాల్వ రాంరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా జర్నలిస్టులు అందించే సేవలు, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి నిస్వార్థ సేవలు అందిస్తున్న జర్నలిస్టుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. కార్యక్రమంలో జర్నలిస్టులు తెలుగు ప్రభ రిపోర్టర్ గోనెల నరేందర్, శశిధర్ రెడ్డి, శ్రీధర్, కృష్ణ, డేవిడ్, ప్రభాకర్, వేణు, నరేందర్ గౌడ్, జయపాల్, సురేష్, శశికాంత్, రఘు, చెన్నయ్య, కిరణ్, సతీష్ రెడ్డి, స్వామి, ఉర్దూ జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News