Tuesday, November 19, 2024
HomeదైవంGadivemula: శివుడికి నిత్య జలాభిషేకం, ఏడూర్ల గవి రహస్యం

Gadivemula: శివుడికి నిత్య జలాభిషేకం, ఏడూర్ల గవి రహస్యం

నిత్య జలాభిషేకం..

గతంలో మండల పరిధిలో పైబోగుల గ్రామం వద్ద వెలసిన ఎంతో ఘన చరిత్ర ఉన్న ఏడూర్ల గవి రహస్యం నిత్యం శివుడికి జలాభిషేకం జరిగే ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే ఇబ్బందిగా ఉండేది. 2020 నుండి దాతల సహకారంతో ఇక్కడ అభివృద్ధిలో అడుగు ముందుకు పడుతుండడంతో నిత్యం భక్తుల రాకతో ఏడూర్ల గవి వద్ద వెలిసి ఉన్న శివాలయానికి ప్రత్యేకత సంతరించుకుంది.

- Advertisement -

కార్తీక సోమవారం సందర్భంగా గ్రామస్తులు భక్తుల సహకారంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దాదాపు 300 మంది భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ఈ ఆలయానికి అభివృద్ధి చేస్తే బాగుంటుందని బొల్లవరం గ్రామానికి చెందిన ప్రముఖ టిడిపి నాయకుడు బాబుల్ రెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధిపై నంద్యాల ఎంపీ శబరికి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి వివరించినట్టు తెలిపారు. రెండవ సంవత్సరం ఇక్కడ భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఉచిత అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు.

రాజుల కాలం నుండి నిత్యం స్వామికి జలాభిషేకం జరిగే ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు సందర్శించి ప్రభుత్వం స్పందించి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సందర్భంగా తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ కుటుంబం తరఫున నోములు కూడా నోచుకున్నట్టు తెలిపారు. సోమవారం సందర్భంగా మండల వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News