YS Sunitha| ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి అసెంబ్లీకి వచ్చారు. శాసనసభ ప్రాంగణంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును కలిసినట్లు తెలుస్తోంది. వివేకా హత్యపై ఆయనతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అసెంబ్లీకి రావడం.. ఉప సభాపతి రఘురామను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సమావేశాలు పెట్టకూడదని.. దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. మరోవైపు వివేకానంద రెడ్డి మాజీ పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు.