Bank Jobs| నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) గుడ్ న్యూస్ చెప్పింది. 253 స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. హైదరాబాద్, ముంబైలలో ఖాళీగా ఉన్న 253 స్పెషల్ ఆఫీసర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్సైట్ https://www.centralbankofindia.co.in ద్వారా ఆన్లైన్లో డిసెంబర్ 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2025 జనవరిలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
వివరాలు..
ఖాళీలు: 253 స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలు
విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, డిగ్రీ, పీజీ, ఎంసీఏ, డిప్లొమా
వయసు: 23 నుంచి 40 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు: రూ. 850 (జనరల్/ ఓబీసీ), రూ.175 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు)
జీతం: పోస్టును బట్టి రూ.45,000 నుంచి రూ.1,20,000