YS Jagan| ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తల్లిదండ్రుల గురించి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి నీకృష్ణుడు.. రాక్షసుడు అరుదుగా పుడతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తన తల్లిదండ్రులను చంద్రబాబు ఏనాడైనా రాష్ట్ర ప్రజలకు చూపించారా..? తల్లిదండ్రులతో కలిసి ఎప్పుడైనా ఉన్నారా..? మీ ఇంటికి తీసుకువచ్చి అన్నం పెట్టారా..? కాలం చేస్తే వారికి కనీసం తలకొరివి అయినా పెట్టారా..? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తినడానికి వెనకడారని విమర్శించారు.
తన చెల్లి షర్మిల మీద చంద్రబాబు బావమరిది బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించడం నిజం కాదా అని ప్రశ్నించారు. వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తన అమ్మను, చెల్లిని చంద్రబాబు తిట్టించారని ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు పేరెంట్స్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.