క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్.
చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు జగన్ హామీ ఇచ్చారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. ఇకపై క్రిస్టియన్ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామన్న సీఎం..తద్వారా వారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందన్నారు. క్రిస్టియన్లకు స్మశానవాటికలు ఏర్పాటుపైనా ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. బిషప్‌లు, రెవరెండ్‌లు తమ కమ్యూనిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను సీఎం ముందు ఉంచారు.
