Thursday, November 21, 2024
HomeతెలంగాణMahabubabad | మహబూబాబాద్ గల్లీ గల్లీలో పోలీసుల పహారా

Mahabubabad | మహబూబాబాద్ గల్లీ గల్లీలో పోలీసుల పహారా

మహబూబాబాద్ (Mahabubabad) లో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. జిల్లా అంతటా నిషేధాజ్ఞలు విధించారు. జిల్లా కేంద్రంలో అలాగే జిల్లా అంతటా గురువారం సెక్షన్ 163 BNSS-2023 (సెక్షన్ 144) అమలులో ఉంటుందని ఎస్పీ సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయమే మహబూబాబాద్ కి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.

- Advertisement -

జిల్లా కేంద్రంలో ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. మహబూబాబాద్ (Mahabubabad) గల్లీ గల్లీలో 163 సెక్షన్ (144) అమలు అవుతోందని మైక్ సెట్ ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ చట్టం అతిక్రమించినచో వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. దీంతో మహబూబాబాద్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావడానికి కూడా భయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News