అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు 46వ పీఠాధిపతి శ్రీ శ్రీ శఠగోపన్ రంగనాథ యతేంద్రమహదేశికన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలంలో 46వ పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప రంగనాథ యతేంద్ర మహాదేశికన్ జిపిఏ సంపత్ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ బ్రహ్మోత్సవ అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు రంగరాజులు అర్చక బృందం వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడు కొలువుతీరిన ద్వజ పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేసి ధ్వజ రోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన నరసింహ స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కొలువు మండలంలో ఉంచి పూజలు నిర్వహించారు. స్వామివారిని శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఎదుట అర్చకులు బేరి దాటను వాయిస్తూ బ్రహ్మాది దేవతలకు ఆహ్వానం పలికారు రాత్రి దేవదేవుడిని సింహ వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక అలంకరణలతో విద్యుత్ దీపాలంకరణలతో భాజా భజంత్రీలు టపాసులతో ప్రాంతమంతా నరసింహస్వామి గోవిందా గోవిందా అంటూ స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ నాలుగు మాడల వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఎగువ అహోబిలంలో ఉదయం హంస వాహనంపై దేవదేవుడు కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి సాంప్రదాయ బద్ధంగా ప్రత్యేకంగా తేచ్చిన పుష్పాలతో పూల అలంకరణలతో అలంకరించారు వేద పండితులు వేదమంత్రోత్సవాల మధ్య భాజా భజంత్రులు మేళతాళాలతో విద్యుత్ దీపాలంకరణల మధ్య బాణాసంచా కాంతులతో నరసింహ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.