రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రెండురోజుల పర్యటన కోసం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆమెకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనస్వాగతం పలికారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె రాష్ట్రానికి వచ్చారు. మినిస్టర్ ఇన్ వెయిటెంగ్ గా రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కార్యక్రమాలను మంత్రి సీతక్క దగ్గరుండి చూసుకోనున్నారు.
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే..
బేగంపేట విమానాశ్రయం నుంచి 6:20 గంటలకు రాజ్ భవన్ వెళ్లనున్న రాష్ట్రపతి.
7:20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్రపతి.
7:55 గంటలకు కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగం.
8:35 గంటలకు రాజ్ భవన్ చేరుకొని, అక్కడే బస చేయనున్న రాష్ట్రపతి.
రేపు ఉదయం 9:55 గంటలకు రాజ్ భవన్ నుంచి శిల్ప కళా వేదికకు వెళ్లనున్న రాష్ట్రపతి.
10-30 నుంచి 11-30 వరకు లోక్ మంథన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగం.
11-30 శిల్ప కళా వేదిక నుంచి బయలుదేరి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లనున్న రాష్ట్రపతి.
బేగంపేట విమానాశ్రయం నుంచి 12- 05 నిమిషాలకు ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్రపతి.