కోనసీమ జిల్లా మండపేట నియోజక వర్గ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు (MLA Vegulla Jogeswara Rao) కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ హోదా దక్కనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ గా ఆయన నియమితులు కానున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీ లో ఎన్నిక కానున్నారు. ఈ మేరకు ఆయన కు ప్రభుత్వం సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతోంది.
- Advertisement -
మండపేట నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో వేగుళ్ళ జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీనియర్ శాసనసభ్యులైన ఆయనకి ఇప్పుడు రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్ పదవి వరించింది.