Monday, November 25, 2024
Homeనేరాలు-ఘోరాలుManchiryala: లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ మహిళా అధికారి

Manchiryala: లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ మహిళా అధికారి

జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న కే శారద వ్యాపారం కోసం ట్రేడ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న విశ్వేశ్వర్ నుంచి సోమవారం రోజున లంచంగా 65,000 తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు పట్టుబడింది. బాధితుడు చేసిన పిర్యాదు మేరకు
మందమర్రి మండలం గద్దెరాగడి గ్రామంలో నివాసముంటున్న విశ్వేశ్వర్ అనే పత్తి వ్యాపారి విశ్వేశ్వర్ హనుమాన్ కాటన్ ఆగ్రో ఏజెన్సీ పేరిట లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. మంచిర్యాల మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ కే శారద ఈ నెల 14వ తేదీన విశ్వేశ్వర్ను కార్యాలయానికి పిలిచి లైసెన్స్ మంజూరు పని పూర్తయిందని, లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. చర్చలు జరిపిన అనంతరం 80 వేల రూపాయలు ఒప్పందం చేసుకొని అదే రోజు 15 వేల రూపాయలు ఇచ్చారు. మిగతా డబ్బుల కోసం పలుమార్లు ఫోన్లు చేస్తుండటంతో భరించలేక విశ్వేశ్వర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా సోమవారం రోజున విశ్వేశ్వర్ నుంచి శారద 65,000 రూపాయలు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్సీ భద్రయ్య నేతృత్వంలో దాడి చేసి డబ్బులతో పాటు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. శారద తీసుకున్న డబ్బులను కెమికల్ పరీక్ష నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం తీసుకున్నది వాస్తవమేనని ప్రకటించి సాయంత్రం పోలీసుల సహాయంతో కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరు పరిచేందుకు తరలించారు. జిల్లాల్లో ఎవరైనా లంచం అడిగితే బాధితులు 9154388954, 9154388985, 9154388984 ఈ మొబైల్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ కోరారు.

ఏసీబీ అధికారి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News