రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) శుక్రవారం ప్రకటించారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 125 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను కేటాయించారు. నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులను తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అభినందించారు.
కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీల లిస్ట్
షాద్‌నగర్ (రంగా రెడ్డి జిల్లా): చైర్‌పర్సన్- ఎ. సులోచన, వైస్ చైర్మన్- మహ్మద్ అలీ ఖాన్
హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా): చైర్మన్- కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్- బంక ఐలయ్య
వేములవాడ (రాజన్న సిరిసిల్ల జిల్లా): చైర్మన్- రొండి రాజు, వైస్ చైర్మన్- కె. రాకేష్
మేడిపల్లి (జగిత్యాల జిల్లా): చైర్మన్- మాదం వినోద్ కుమార్, వైస్ చైర్మన్- మిట్టపల్లి రాజారెడ్డి
రుద్రంగి (రాజన్న సిరిసిల్ల జిల్లా): చైర్మన్- చెలుకల తిరుపతి, వైస్ చైర్మన్- బొజ్జా మల్లేశం
కథలాపూర్ (జగిత్యాల జిల్లా): చైర్మన్- పుండ్ర నారాయణ రెడ్డి, వైస్ చైర్ పర్సన్- పులి శిరీష
కోనరావుపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా): చైర్మన్- కాచకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్- తాళ్లపల్లి ప్రభాకర్
పరిగి (వికారాబాద్ జిల్లా): చైర్మన్- భూమన్నగారి పరుశురామ్ రెడ్డి, వైస్ చైర్మన్- సయ్యద్ అయూబ్ హుస్సేన్
కల్వకుర్తి (నాగర్ కర్నూల్ జిల్లా): చైర్మన్- పాక మణిల్, వైస్ చైర్మన్- దేశినేని పండిత్ రావు
ఆమనగల్ (రంగా రెడ్డి జిల్లా): చైర్ పర్సన్- యట్టా గీత, వైస్ చైర్మన్- జి. భాస్కర్ రెడ్డి
వి.సైదాపూర్ (కరీంనగర్ జిల్లా): చైర్మన్- దొంత సుధాకర్, వైస్ చైర్మన్- న్యాదండ్ల రాజ్ కుమార్