ఇప్పటివరకు కొనసాగుతున్న ఎన్నికల ట్రెండ్ చూస్తుంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కూటమికి ఓటర్లు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చినట్టు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర (Maharashtra)లో ఎన్డీయే, జార్ఖండ్ (Jharkhand) లో ఇండి కూటమికి ప్రజలు పట్టం కట్టారని చెప్పవచ్చు. మధ్యాహ్నం 2 గంటల వరకు వెలువడ్డ ఫలితాల ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 216 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండి అలయన్స్ మహావికాస్ అఘాడీ 55 స్థానాల్లో, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. ఇండి కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… ఎన్డీయే 28 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. వాయనాడ్ లోక్ సభ స్థానంలో 3 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్ లో ఇండి కూటమి సంబురాలు మొదలుపెట్టేశాయి.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీ లేదా కూటమి 145 సీట్లు గెలవాలి. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో మెజారిటీ సంఖ్య 41 కాగా, ఈ రెండు రాష్ట్రాల్లోనూ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.