Saturday, November 23, 2024
Homeహెల్త్Star Liver launched by Rajamauli: స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన రాజ‌మౌళి

Star Liver launched by Rajamauli: స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన రాజ‌మౌళి

కంప్లీట్ లివర్ కేర్

స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడాలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ‌మౌళి, స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రపంచ స్థాయి సదుపాయాలతో సిద్ధం చేసిన నిర్వాహ‌కులను అభినందించారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ఎస్ రాజ‌మౌళి మాట్లాడుతూ, “స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థ మన హైదరాబాద్‌లో ప్రారంభం కావడం ఎంతో గర్వకారణం. లివర్ అనేది మన శరీరానికి ముఖ్యమైన భాగం. ఇలాంటి విభాగానికి ప్రత్యేకమైన సంరక్షణ అందించేందుకు ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపొందించిన ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడి బృందం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఇన్‌స్టిట్యూట్ కేవలం హైదరాబాద్‌ మాత్రమే కాదు, దేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదుగుతుంది” అని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రజలకు ప్రపంచ స్థాయి లివర్ కేర్ అందించడంతో పాటు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు. ఈ గొప్ప కార్యాన్ని ప్రారంభించ‌డానికి వ‌చ్చిన రాజ‌మౌళికి స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ మెంట‌ర్ డాక్ట‌ర్ ర‌వీంద్ర‌నాథ్, డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మెట్లు శ్రీ‌నివాస్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్ట‌ర్ గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌మేష్ గుడ‌పాటి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, వైద్యనిపుణులు, అతిథులు ఆసుపత్రి సౌకర్యాలు, సేవలను ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News