Monday, November 25, 2024
HomeఆటKNL: ఎస్ జి ఎఫ్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలి

KNL: ఎస్ జి ఎఫ్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలి

గుడ్ లక్

ఢిల్లీలో జరిగే 68 వ జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పేర్కొన్నారు. సోమవారం సునయన ఆడిటోరియంలో నవంబర్ 16 నుంచి 18 వరకు గుడివాడలో జరిగిన 68 వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మరియు ఈనెల 23 నుంచి 24 రేణిగుంటలో జరిగే 68 రాష్ట్రస్థాయి SGF అండర్ 19 జూడో పోటీలలో పాల్గొని మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అభినందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 16 నుంచి 18 వరకు గుడివాడలో జరిగిన 68 వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన ఎం పుష్పాంజలి 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం,
బి నవీన్ 102 కేజీల విభాగంలో స్వర్ణ పతకం,
ఎన్ లోహిత 87 కేజీల విభాగంలో కాంస్య పతకం,
బి శేషు 102 కేజీల భాగంలో కాంస్య పతకాలను సాధించారు. ఈనెల 23 నుంచి 24 రేణిగుంటలో జరిగే 68వ రాష్ట్రస్థాయి SGF అండర్ 19 జూడో పోటీలలో ఆర్ ఇసాక్ 73 కేజీల భాగంలో వెండి పధకం, బి శేషు 90 కేజీల విభాగంలో కాంస్య పతకాలను సాధించిన క్రీడాకారులను అభినందించారు. డిసెంబర్ నెల రెండో వారంలో ఢిల్లీలో జరిగే 68 వ జాతీయస్థాయి SGF అండర్ 19 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొననున్నారని ఈ పోటీలలో కూడా పథకాలను సాధించి మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో డిఎస్డివో భూపతి రావ్, డివిఈఓ పరమేశ్వర్ రెడ్డి, క్రీడల కోచ్ లు యూసుఫ్, చంద్రశేఖర్, మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News