సంగారెడ్డి కలెక్టరేట్ (Sangareddy Collectorate)లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఆఫీస్ అవర్స్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫైళ్లు, కంప్యూటర్లు దగ్ధం అయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -
కాగా, సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ (Sangareddy Collectorate)కి ప్రజలు పెద్దఎత్తున హాజరై తమ ఫిర్యాదులను అందజేస్తున్నారు. అదే సమయంలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు కంప్యూటర్లు, భారీ సంఖ్యలో ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే కలెక్టరేట్లోని ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకముందే సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.