Thursday, November 28, 2024
HomeతెలంగాణKTR: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఐపీఎస్ అధికారుల సంఘం

KTR: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఐపీఎస్ అధికారుల సంఘం

KTR| సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సివిల్ సర్వీస్ అధికారిపై కేటీఆర్ చేసిన విమర్శలు.. రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుందని చెప్పింది. అయితే అధికారులపై ఇటువంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారాహిత్యమైనవిగా ఉన్నాయంటూ మండిపడింది. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు అండగా ఉంటామని తెలిపింది.

- Advertisement -

ఇకపై ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని.. వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చింది. కాగా రెండు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దీక్షా దివస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News