Thursday, November 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Raghava Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

Raghava Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

Raghava Reddy| వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి (Avinash Reddy) పీఏ రాఘవరెడ్డికి కడప జిల్లా కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆ పార్టీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

మాజీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి షర్మిల, మరో సోదరి సునీతపై వర్రాతో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో 16 రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News