Konda Surekha| కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని కేటీఆర్ అండ్ బ్యాచ్ ప్రయత్నం చేస్తున్నారు అని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగం ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థిని మరణంను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఓ విద్యార్థిని మృతి చెందిందని.. ఇందుకు చాలా బాధగా ఉందన్నారు. బాధిత విద్యార్థిని ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించామని..అయినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని చెప్పుకొచ్చారు. అయినా కానీ విద్యార్థిని మృతిపై రాజకీయాలు చేయడం తగదని సూచించార.
సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవని గుర్తు చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని సురేఖ ఆరోపించారు.