Thursday, December 5, 2024
Homeనేరాలు-ఘోరాలుWarangal | కాళ్ళు, చేతులు కట్టేసి.. చివరికి కారులోనే శవం

Warangal | కాళ్ళు, చేతులు కట్టేసి.. చివరికి కారులోనే శవం

వరంగల్ (Warangal) జిల్లాలో కారులో డెడ్ బాడీ కలకలం రేపింది. మంగళవారం ఉదయం రంగంపేట సమీపంలో పార్క్ చేసిన కారులో మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం రంగంపేట సమీపంలో పార్కు చేసి ఉన్న కారు కిటికీలోంచి చూడగా వెనుక సీటుపై తాడుతో కట్టేసి ఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా డ్రైవింగ్ లైసెన్స్ లభించింది. దానిని పరిశీలిస్తే హత్యకి గురైంది హన్మకొండలోని కాకతీయ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న రాజ్‌మోహన్‌ గా గుర్తించారు.

రాజ్‌మోహన్‌ను వరంగల్ (Warangal) నగర శివార్లలో హత్య చేసి, మృతదేహాన్ని అతని కారులోనే ఉంచి రంగంపేటలో వదిలేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి కారు ఆపి వెళ్లిపోయాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారును వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News