వరి కోసే యంత్రంలో ప్రమాదవశాత్తు పడి మృత్యుంజయుడుగా నిలిచాడు ఓ రైతు. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలంలోని, మంగాపుంతండాకు చెందిన గుగులోత్ శ్రీనివాసరావు అనే రైతుకు రెప్పపాటులో ప్రమాదం తప్పింది. మంగళవారం తన పొలంలో వరికోసే యంత్రంతో వరి కోయిస్తున్నారు. కాగా ధాన్యం యంత్రం డబ్బా (ధాన్యం నిల్వ చేసే) నిండి కిందపోతుండటంతో వాటిని సరి చేసేందుకు యంత్రం డబ్బా వద్దకు వెళ్లి ధాన్యంను పక్కకు సరి చేస్తున్నాడు…ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తన షర్టు తగిలి మిషన్ శ్రీనివాసరావును యంత్రం గుంజుకుంది. అంతే అందులో ఇరుక్కపోయాడు.
అరుపులు, కేకలు
పక్కన ఉన్న రైతులు గమనించి ఆరుపులు, కేకలు వేయటంతో మిషన్ డెవర్ వెంటనే నిలిపివేశాడు. అప్పటికే అందులోఇరుక్కపోయాడు. పక్కన ఉన్న రైతులు గమనించి ఆరుపులు, కేకలు వేయటంతో మిషన్ డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. అప్పటికే అందులో ఇరుక్కోవటంతో మిషన్ కు సంబంధించిన పళ్లు ఒంటినిండా కుచ్చుకున్నాయి. కదిలే పరిస్థితి లేదు. నొప్పులు తట్టుకోలేక అవస్థలు పడ్డాడు. శరీరంలోకి వెళ్లిన చువ్వలను గుంజేందుకు సహచర రైతులు తీవ్రంగా శ్రమించారు. మిషన్ డ్రైవర్, గ్రామస్తులు, కలిసి అతనిని బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆర్తనాదాలతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
అతి కష్టం మీద
డబ్బా పార్టులను ఎక్కడిక్కడ తొలిగించి అతి కష్టం మీద ఎట్టకేలకు బయటకు తీశారు. అక్కడ నుంచి అతనని నేలకొండపల్లి ప్రభుత్వ హస్పిటల్ కు తీసుకెళ్లి ప్రధమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. మిషన్ లో పడిన ఈయన నిజంగా మృత్యుంజయుడు అని పలువురు పేర్కొన్నారు.