Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడటంతో థియేటర్ల వద్ద బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు.
- Advertisement -
ఈ సందర్భంగా సినిమాలోని జాతర సీన్‌లో బన్నీ నటన చూసి అభిమానులు అంతా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. దీంతో బన్నీ వారికి కృతజ్ఞతలు చెబుతూ అభివాదం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వైల్డ్ ఫైర్ క్రియేట్ చేస్తోంది. సినిమాలో అల్లు అర్జున్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.