అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 (Pushpa 2) ప్రీమియర్ షోలో భాగంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా… ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకి గురై ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో సర్వత్రా అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యర్థం అవుతోంది. సంధ్య థియేటర్ వద్ద నిరసనకారులు అల్లు అర్జున్ కి, థియేటర్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
- Advertisement -
ఈ క్రమంలో అభిమాని మృతి వివాదంపై అల్లు అర్జున్ టీమ్ (Allu Arjun Team) స్పందించింది. బుధవారం రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరమని వెల్లడించింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తమ బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది.