తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి విశేష కళ్యాణం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతో గ్రామ పురవీధుల్లో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు.
అందంగా ఆలయం ముస్తాబు
స్వామి వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని ఆలయమంతా వివిధ రకాల పూలతో పచ్చని పందిరి ఏర్పాటు చేశారు. పచ్చని మండపంలో స్వామివారి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించి వేదపండితులు సిఎచ్ నరసింహ చారి, పి.రామచారి, పద్మనాభంలు కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి విశేష కల్యాణంలో శనివారం ఆలయ చైర్మన్ జిల్లెల్ల పవన్ కుమార్ రెడ్డి-శరణ్య, మిద్దెల శ్యామ్ సుందర్ రెడ్డి-జ్యోత్స్న, విజయ భాస్కర్ రెడ్డి-ప్రత్యూష పుణ్య దంపతులు భూదేవి శ్రీదేవి అమ్మావార్ల వైపు కొంతమంది, స్వామివారి వైపు కొంతమంది పుణ్య దంపతులు కూర్చుని శ్రీనివాసుని కల్యాణాన్ని జరిపించారు.
కట్న కానుకలు, అన్నదానం కూడా
కళ్యాణానికి ముఖ్య అతిథులుగా శ్రీ అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరా శ్రీ గురువు, ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత-నరసింహా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయం వద్ద భక్తులకు తీర్ధప్రసాదాలు ఇచ్చి, అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి వారికి పెద్ద సంఖ్యలో భక్తులు కట్న కానుకలు సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి కళ్యాణ అనంతరం ఆలయ చైర్మన్ జిల్లెల్ల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో మెలగాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అధునాతనమైన కోనేరు
స్వామివారి కోనేరును అధునాతనమైన పద్ధతిలో నిర్మాణం చేపట్టి భక్తులకు అందించనున్నట్లు ఆయన కొనియాడారు. ఇప్పటికే 50 శాతం పూర్తయిన కోనేరులో శనివారం కళ్యాణాన్ని పురస్కరించుకొని జల పూజ చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి వారి కల్యాణంలో ఈవో స్నేహలత ఆలయ పాలకమండలి వైస్ చైర్మన్ కాకి అమృత-అంజయ్య, డైరెక్టర్లు స్వామి గౌడ్,తిక్కల యాదయ్య,వెంకటయ్య,జంగయ్య,ఏఎంసీ డైరెక్టర్లు అంజయ్య గుప్త,అజీమ్,మాజీ సర్పంచులు వరలక్ష్మి రాజేందర్ రెడ్డి,భక్కి కుమార్,మణేమ్మ-యాదయ్య,మాజీ ఎంపిటీసిలు తిక్కల వెంకటయ్య,అంబాజీ,కటికెల యాదయ్య,మాజీ గ్రామ ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి,దేవాదాయ అధికారులు దేవేందర్,చంద్రయ్య ఆంజనేయులు,మాజీ ఆలయ చైర్మన్ శ్రీశైలం, నాయకులు శ్రీనివాసాచారి, కాకి కృష్ణ, నరసింహ గౌడ్, కృష్ణ రెడ్డి, చిన్నహరిమోహన్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, డిగ్రీ కృష్ణ, తిరుపతి రెడ్డి, జిల్లెల్ల సుదర్షన్ రెడ్డి, అంజనేయులు గుప్త, ప్రావీన్, జంగారెడ్డి, నరసింహ రెడ్డి, జీనుకుంట్ల భాస్కర్, జంగయ్య, కాకి వినోద్, శివ, అంజనేయులు, ఆశోక్ రెడ్డి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.