Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Changing places name: పేర్ల మార్పు అనవసరం

Changing places name: పేర్ల మార్పు అనవసరం

దేశంలో కొన్ని ప్రదేశాలు, రోడ్లు, వీధుల పేర్లను మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అభ్యంతరం తెలియజేసింది. గతంలో భారత్పై దాడులు చేసి, దేశాన్ని దోచుకోవడం ఆలయాలను ధ్వంసం చేయడం వంటి దారుణా లకు పాల్పడిన రాజుల పేర్లు ఇప్పటికీ ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలోని రోడ్లకు, వీధులకు కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ఒక పిల్పై సుప్రీంకోర్టు స్పందించింది. దాడులకు పాల్పడినవారు పెట్టిన పేర్లను మార్చాలని కోరిన ఈ పిల్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. భారతదేశం ‘గతం చేతిలో బందీగా’ ఉండిపోవడం సమంజసం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలోని అనేక రోడ్లు, వీధులు, ప్రదేశాలు, పట్ట ణాలు, నగరాలకు ఒకప్పటి ముష్కరులు, యుద్ధోన్మాదులు, ఆటవిక రాజుల పేర్లే కొనసాగడం పట్ల పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి ముస్లిం దేశాలలో హిందూ మతానికి చెందిన వ్యక్తుల పేర్లను తొలగించడం జరిగిందనే విషయాన్ని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. సమాజంలో ఘర్షణలు రేకెత్తించడానికి కొందరు తమకు అవసరమైన విధంగా చర్రితలోని ఘట్టాలను ఎంపిక చేయడం జరుగుతోందని, పిటిషనర్ కూడా అటువంటివారికి వంత పాడడం జరుగు తోందని కోర్టు ఆ పిటిషనర్ను మందలించింది. ‘మీరు దేశం అట్టుడికిపోవాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. సమాజంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగే విధంగా పిటిషన్లు వేయడం భావ్యం కాదు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి చర్చల వల్ల, ప్రస్తావనల వల్ల పాలనకు సంబంధించిన అనేక సమస్యలు పక్కదోవ పడుతున్నాయని కూడా కోర్టు హెచ్చరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కీలక ప్రాంతాల్లో పేర్లను మార్చడానికి అభ్యంతరం లేదు కానీ, దేశవ్యాప్తంగా ఇదే పద్ధతిని అనుసరించడం అన్నది సరైన చర్యగా తోచడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా పేర్లను మార్చడమన్నది స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి కానీ, దీర్ఘకాలంలో ఈ పద్ధతి వల్ల సమాజంలో విచ్ఛిన్న ధోరణు లు ప్రబలే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, 14, 18 శతాబ్దాల మధ్య ప్రపంచంలోని అనేక దేశాలలో నగరాలు, పట్టణాలు, రోడ్లకు ఐరోపా దేశాలవారి పేర్లను పెట్టడం జరిగింది.అదే విధంగా 1930లో కాన్స్టాంటినోపోల్ అనే నగరానికి ఇస్తాంబుల్ అనే నామకరణం జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చిన తర్వాత అనేక ప్రదేశాలలో వలస పాలకుల పేర్లను మార్చాలనే తపన పెరిగింది. కొన్ని పేర్లను వెనువెంటనే మార్చాల్సి వచ్చింది కూడా. అయితే, ఈ విధంగా చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. విదేశీ పేర్ల పట్ల సహజంగా ఉన్న ద్వేషంతో పాటు, దోపిడీదార్లు, యుద్ధోన్మాదులు, విధ్వంసక శక్తులు వంటి పేర్లను ప్రయోగిస్తూ అటువంటి వారి పేర్లను మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్లో సంఖ్యా బలాన్ని అవకాశంగా తీసుకుని ఢిల్లీలో అనేక ప్రాంతాలు, రోడ్ల పేర్లను ఇప్పటికే మార్చడం కూడా జరిగిపోయింది. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డును, ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్, మొఘల్సరాయ్ నగరాలకు కొత్త పేర్లు పెట్టడం జరిగింది.
పిటిషనర్ తన పిల్లో మహమ్మద్ గజనీ, ఇబ్రహీం లోడీల పేర్లను కూడా ప్రస్తావించాడు. వీరిద్దరూ దేశాన్ని దోచుకు వెళ్లారని, అనేక ఆలయాలను విధ్వంసం చేశారని, వేలాది మంది హిందువులను నిర్దాక్షిణ్యంగా హతమార్చారని, అందువల్ల ఇటువంటి వారి పేర్లను స్వతంత్ర భారతదేశంలో ప్రదేశాలకు, రోడ్లకు పెట్టడం చర్రితకు వక్రభాష్యం చెప్పడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. నిజానికి, గజనీ, లోడీల నేపథ్యంలో చాలా తేడా ఉంది. వీరిద్దరి మధ్యా అయిదు శతాబ్దాల అంతరం ఉంది. ఔరంగజేబు, గజనీ, లోడీలకు భారత్ మీద ఏవ్రతం ప్రేమాభిమానాలు లేవని, వారు భారతను ఎంతగానో ద్వేషించారని, వారిక్కడకు దేశాన్ని దోచుకోవడా నికే వచ్చారని పిటిషనర్ పేర్కొన్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో ఇటువంటి వారి పేర్లను పెట్టడం ఏమాత్రం సమంజసంగా లేదని, ఈ పేర్లను తొలగించి ఇక్కడి రాజుల పేర్లను, ఈ దేశాన్ని అభివృద్ధి చేసినవారి పేర్లను పెట్టాలని ఆయన అన్నారు. అయితే, చర్రితను విస్మరించడం పట్ల సుప్రీం కోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఈ దాడులను, ఈ దోపిడీలను మీరు చరిత్ర నుంచి తొలగించగలరా? పేర్ల మార్పు వల్ల మీరు సాధించేది ఏమిటి?’ అని సుప్రీంకోర్టు ఆయన్ని నిలదీసింది. ఇక్కడి చట్టాలు, రాజ్యాంగం, లౌకికవాదం తదితర విలువైన అంశాల గురించి. సుప్రీంకోర్టు ఆయనకు గుర్తు చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో మతోన్మాదానికి స్థానం లేదని అది స్పష్టం చేసింది. దేశ ప్రజలంతా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాజ్యాంగ ఉపోద్ఘాతంలోనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. అది చరిత్రను ఏ విధంగా దుర్వినియోగం చేయడం మంచిది కాదని కూడా అది స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News