Wednesday, December 18, 2024
Homeఇంటర్నేషనల్Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి 11 మంది భారతీయులు మృతి

Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి 11 మంది భారతీయులు మృతి

జార్జియా(Georgia)లోని భారతీయ రెస్టారెంట్ గూడౌరి మౌంటెయిన్ రిసార్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రిసార్ట్‌లో పనిచేస్తున్న 11 మంది భారతీయులు మృతి చెందడం కలకలం రేపింది. విషవాయువు కార్బన్ మోనోక్సైడ్ పీల్చడం కారణంగా వీరు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామని జార్జియా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -

ఈ విషాద ఘటనపై జార్జియాలోని భారత రాయబార కార్యాలయం(Indian Embassy) కూడా స్పందించింది. రిసార్ట్‌లో మొత్తం 12 మంది విషవాయువు పీల్చారని తెలిపింది. వీరిలో 11 మంది భారతీయులు మృతి చెందారని.. జార్జియాకు చెందిన మరొకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మృతుల కుటుంబాలకు తమ సంతాపం తెలియజేస్తున్నామని చెప్పింది. ప్రాణాలు కోల్పోయిన భారతీయుల గురించి సమాచారాన్ని తెలుసుకునేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని వెల్లడించింది. కాగా పవర్ జనరేటర్ నుంచి కార్బన్ మోనోక్సైడ్ విడుదలైనట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని జార్జియా దర్యాప్తు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News