తక్కువ టైంలో టెక్నాలజీతో పలు నేరాలు, సమస్యలను పోలీసులు సమర్థవంతంగా పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా నేరాలకు చెక్ పెట్టేందుకు యాప్ సేవలు చాలాబాగా పనిచేస్తున్నాయి. ఓవైపు సీసీ కెమరాలు, మరోవైపు యాప్స్ ఖాకీలకు తమ విధులు నిర్వహించటంలో సహాయపడుతున్నాయి.
మొబైల్ ఫోన్లు దొంగతనం చేసే ముఠాలు పర్యాటక ప్రాంతాల్లో, పుణ్యక్షేత్రాల్లో చాలా ఎక్కువ. అందునా తిరుమల-తిరుపతిలో సెల్ఫోన్ దొంగతనాలు ఏస్థాయిలో ఉంటాయో మీరు ఈజీగా ఊహించవచ్చు. ఇలాంటి బాధితుల కోసం స్మార్ట్ ఎత్తుగడలు వేసిన పోలీసులు ఏకంగా మొబైల్ హంట్ అప్లికేషన్ సాయంతో దొంగలపాలైన వందలాది మొబైల్స్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాయి.
తిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం సీఈఐ ఆర్ ద్వారా తిరుపతి జిల్లా పోలీసు వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ యాప్ ద్వారా 9490617873 అప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేసి ఫలితాలు సాధించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 11 విడతలలో 3840 సెల్ ఫోన్ లను రికవరీ చేసి సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేసినట్టు తెలిపారు. వీటి విలువ రూ. 6,69,40,000 పైమాటే. ప్రసుత్తం 12వ విడతలో నెల రోజుల వ్యవధిలోనే రికవరీ చేసిన 435 మొబైల్ ఫోన్ల (వాటి విలువ సుమారు రూ.87,00,000/-) జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు వివరాలు వెల్లడించటంతో బాధితుల్లో ఆనందం వచ్చింది. ఇలాంటి సేవలు సామాన్యుల్లో పోలీసులపై అభిమానం, గౌరవం పెంచేలా చేస్తున్నాయి.
మొబైల్ మిస్ అవ్వగానే ఈ కింద చర్యలు చేపట్టాలని పోలీసులు సూచిస్తున్నారు
- మీ మొబైల్ నెంబర్ ను వెంటనే ఆలస్యం చేయకుండా బ్లాక్ చేపించుకోవాలి
- మీ మొబైల్ పాస్వర్డ్ , ఫోన్ పే గూగుల్ పే వంటి పాస్వర్డ్లులు చాలా స్ట్రాంగ్ ఉండాలి.
- మొబైల్ ను మిస్/ దొంగలించబడితే మీరు వెంటనే మొబైల్ హంట్ నెంబర్ కు పోర్టల్ నందు మీరు కంప్లైంట్ రైజ్ చేయవలెను.
- రికవరీ చేసిన మొబైల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా స్వాధీనం చేసుకున్నారు.