Tuesday, March 11, 2025
HomeతెలంగాణKukatpally: బూత్ స్థాయి భేటీలో మాధవరం కృష్ణారావు

Kukatpally: బూత్ స్థాయి భేటీలో మాధవరం కృష్ణారావు

ఓల్డ్ బోయిన పల్లిలో జరిగిన బూత్ స్థాయి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ ముద్దమ్ నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజక వర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకి అందించడం లో ముందున్నామన్నారు. బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త చిత్త శుద్ధతో పని చేస్తే, మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కృష్ణారావు. ఇప్పటికే సామాన్యులకు నిత్యవసర ధరలు అందుబాటులో లేకుండా చేసిన బిజెపి ప్రభుత్వం, గ్యాస్ ధరలను పెంచి వారి వెన్ను విరుస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News