Tuesday, May 21, 2024
Homeచిత్ర ప్రభBanny crazy proj: 'అర్జున్ రెడ్డి' సందీప్ వంగాతో బన్నీ సినిమా

Banny crazy proj: ‘అర్జున్ రెడ్డి’ సందీప్ వంగాతో బన్నీ సినిమా

వావ్ వాటే క్రేజీ కాంబో అనేలా ఉంది కదా ఈ టైటిల్ చూడగానే. అల్లు అర్జున్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో జత కట్టడం అంటే బ్లాక్ బస్టర్ ఖాయమనేలా బన్నీ మాస్ ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉంది. ఇండియాలో అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీ అయిన టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈమేరకు ట్విట్టర్ లో అధికారికంగా ట్వీట్ చేశారు. అల్లు అర్జున్, సందీప్ వంగా, టీ సిరీస్ అనే మూడు పవర్ హౌసుల కాంబోపై వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని టీ సిరీస్ ట్వీట్ లో పేర్కొంది.

- Advertisement -

భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తుండగా, భారీ ఎంటర్ టైన్ మెంట్ ప్రాజెక్టుగా ఇది లాంచ్ కానుంది. ప్రస్తుతం సందీప్ వంగా డైరెక్షన్ లో తుది మెరుగులు దిద్దుకుంటున్న ‘స్పిరిట్’ పూర్తవ్వగానే బన్నీ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. స్పిరిట్ లో డార్లింగ్ హీరో ప్రభాస్ నటిస్తున్నారు. ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీగానే టీ సిరీస్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోంది.

పుష్ప తరువాత అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ ఐకన్ స్టార్ కు బాలీవుడ్ లోనూ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అట్లీ డైరెక్షన్ లో షారూఖ్ ఖాన్, నయనతారల జవాన్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ చేయాలంటూ బన్నీని సంప్రదించగా ఆయన నో చెప్పారట. మంచి బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ కోసం బన్నీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుండగా ఈ డీల్ సీల్ అవ్వటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News