హీరో అల్లు అర్జున్‌పై(Allu Arjun) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్‌పై స్పందిస్తూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బన్నీ మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు కలెక్షన్ల మీద ధ్యాస తప్పితే ప్రజలపై ధ్యాస లేదని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించే అలా మాట్లాడారని వివరించారు. దానిపై మీరు రియల్ హీరోగా మాట్లాడకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివిన విధంగా ఉందని ఎద్దేవా చేశారు. రియల్ లైఫ్‌లోనూ రీల్ హీరోగానే బన్నీ నటిస్తున్నారని విమర్శించారు.
ఏం మాట్లాడుతున్నారో బన్నీకి క్లారిటీ లేదని.. ఒక సెలబ్రెటీ అయి బాధ్యతాయుతంగా మాట్లాడలదేన్నారు. క్యారెక్టర్‌ను దెబ్బతీశారని అనడం విడ్దూరంగా ఉందన్నారు. మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమాకు నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచిందని గుర్తు చేశారు. ఆరోజు సంధ్య థియేటర్‌లో బన్నీ సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చిందని.. అంతా గందరగోళంగా ఉందన్నారు. ఏం జరుగుతుందనే కనీస ధ్యాస కూడా లేకుండా సినిమా చూస్తున్నారని ధ్వజమెత్తారు.