Tuesday, January 14, 2025
Homeఆంధ్రప్రదేశ్PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏపీ పర్యటన ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఆయన రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh)తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా పుడిమడకలో ఎన్టీపీసీ(NTPC), ఏపీ జెన్ కో జాయింట్‌గా నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌(Green Hydrogen Hub).. అలాగే నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్(Mittal Steel Plant) నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

కాగా మొత్తం రూ.84,700 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు పెట్టనున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. ఈ రెండు ప్రాజెక్టులను ఏపీ జెన్‌కో, ఎన్టీపీసీ 50: 50 భాగస్వామ్యంతో నిర్మించనున్నాయి. ప్రాజెక్టుల వల్ల వచ్చే నాలుగు సంవత్సరాల్లో 48వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News