Friday, December 27, 2024
Homeచిత్ర ప్రభHitler Re-release: మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ రీ రిలీజ్

Hitler Re-release: మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ రీ రిలీజ్

చిరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటైన ‘హిట్లర్’ సినిమా న్యూఇయర్ లో మెగా ఫ్యాన్స్ కు పెద్ద ఫీస్ట్ ఇస్తోంది. హిట్లర్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడైన ప్రకటన మెగాస్టార్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపటం ఖాయంగా మారింది.

- Advertisement -

సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన చిరు హిట్లర్ సినిమా 1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరు ఫిల్మ్ జర్నీలో పెద్ద టర్నింగ్ పాయింట్లలో ఒకటి. తన ఇమేజ్ కు భిన్నంగా ఐదుగురు చెల్లెలకు అన్నగా మెగాస్టార్ నటించిన ‘హిట్లర్’ మూవీ అందుకే అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. మెగాస్టార్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది హిట్లర్ సినిమాతోనే.

27 ఏళ్ల తరువాత మళ్లీ

హిట్లర్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 27 ఏళ్లు పూర్తవుతుంది. 1997 జనవరి 4న ‘హిట్లర్’ మూవీ రిలీజ్ అయింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ మూవీని సెంటిమెంటల్ గా మళ్లీ జనవరిలోనే రీ రిలీజ్ చేస్తున్నారు. సూపర్ సాంగ్స్, ఎమోషన్స్ సీన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కలిసి ఉన్న ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు థియేటర్స్ లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News