Monday, January 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Vijayanand: ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్

Vijayanand: ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary)గా కె.విజయానంద్(K.Vijayanand) బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తిరుమల, దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులు మధ్య సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాయి ప్రసాద్, కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామల రావు, జీఏడి కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు కాంతిలాల్ దండే, కుమార్ విశ్వజిత్, పలువురు కార్యదర్శులు, ఇతర అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ప్రస్తుతం సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న నీరభ్‌ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) పదవీ విరమణ చేశారు. దీంతో విజయానంద్ కొత్త సీఎస్‌గా నియమితులయ్యారు. 2025 నవంబర్‌ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 1992 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ సోమవారం వరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. తొలుత ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. తదుపరి ఏపీ ట్రాన్స్‌కో, జెన్ఎన్‌కో ఎండీగా సుధీర్ఘ కాలం పాటు విధుల్లో ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధకారిగా కూడా పనిచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News