Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తాం

Srisailam: దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తాం

శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహకరిస్తామని వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీశైలంలో ఈవో లవన్న ఆధ్వర్యంలో దేవస్థానం అభివృద్ధిలో భాగంగా దేవస్థానం ఎదుటి ఉన్న దుకాణాలను తొలగించి, వారిని కాంప్లెక్స్ లో దుకాణాలు పెట్టుకోమని ఈవో తెలిపారు. ఈ అభివృద్ధిలో భాగంగా వాసవి సత్రం కూడా కొద్ది భాగం స్వచ్ఛందంగా తీసివేయనున్నట్టు తెలిపారు. అంతేకానీ వాసవి సత్రం కొద్ది భాగం తీసివేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, కేవలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా కొంతమేర స్వచ్ఛందంగా తీసివేస్తున్నామని తెలిపారు. ఈ విషయం కొన్ని సామాజిక మాధ్యమాల్లో వేరే విధంగా పోస్టులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించ గలరని విజ్ఞప్తి చేస్తున్నానని దేవకి వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News