Thursday, January 9, 2025
Homeచిత్ర ప్రభDaaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’ ట్రైలర్ డేట్ ఫిక్స్

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’ ట్రైలర్ డేట్ ఫిక్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), దర్శకుడు బాబీ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్లగా నటిస్తుండగా.. బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

- Advertisement -

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌(Daaku Maharaaj Trailer) రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఇండియాలో ఈ చిత్రం ట్రైలర్ జనవరి 5వ తేదీ ఉదయం 8 గంటల 39 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక జనవరి 4వ తేదీ రాత్రి 9 గంటల 9 నిమిషాలకి అమెరికాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News