మేడ్చల్ , మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీలో వింగ్స్ మీడియా, G5 మీడియా, 21st సెంచరీ అకాడమీతో కలిసి మొదటి ప్రయత్నం లో సివిల్స్ సాధించడం ఎలా అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు.
6వ తరగతి నుంచి
21st సెంచరీ IAS అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ భావనీ శంకర్ విద్యార్థులతో మాట్లాడుతూ , UPSC పరీక్షలపై సమగ్ర అవగాహన కలిగించే అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సివిల్స్ సాధించడంలో, క్రమశిక్షణ-టైం మానేజ్మెంట్ ముఖ్యమని, అలాగే 6వ తరగతి నుంచి పాఠ్యాంశాలపై బలమైన ప్రాథమిక అవగాహన అవసరమని అన్నారు. ఈ సందర్భంలో అకాడమీ నిపుణులు సివిల్స్ పై రూపొందించిన పుస్తకాలను కళాశాల సెక్రటరీ టి.వి . రెడ్డి లాంచ్ చేసి, విద్యార్థుల కోసం కళాశాల గ్రంథాలయంలో ఉంచారు.
కళాశాల సెక్రటరీ టి.వి.రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సెమినార్ నుండి ముఖ్యమైన అంశాలను సేకరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత , TPO డాక్టర్ శ్రీకాంత్, వింగ్స్ మీడియా, G5 మీడియా గ్రూప్ డైరెక్టర్ గిరి ప్రకాశ్, ఎడిటర్ గణేష్, మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు.