ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను(AP Voters List) రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,14,40,447 ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,02,88,543 మంది పురుషులు, 2,10,81,814 మంది మహిళా ఓటర్లు, 3,400 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
- 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న యువ ఓటర్లు 5,14,646 మంది ఉన్నారు.
- సర్వీసు ఓటర్లు 66,690 మంది ఉన్నారు.
- రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
- గత ఏడాదితో పోలిస్తే 232 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి.