Friday, January 10, 2025
Homeనేరాలు-ఘోరాలుJails: తెలంగాణ జైళ్లలో పెరిగిన ఖైదీల సంఖ్య

Jails: తెలంగాణ జైళ్లలో పెరిగిన ఖైదీల సంఖ్య

జైళ్లలోనూ టెక్నాలజీ

తెలంగాణ జైళ్లల్లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాదిలో 9710 మంది ఖైదీలు అధికంగా ఉన్నట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. హైద్రాబాద్ లోని చంచల్ గూడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ హాల్ లో జైళ్ల శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె నివేదిక వివరాలను వెల్లడించారు.

- Advertisement -

ఈ-ములాఖత్ లో వీడియో కాల్

“హత్య కేసుల్లో 2,754 మంది శిక్షననుభవిస్తున్నారు. పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు ఖైదీలుగా ఉన్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సల్స్టాన్సెస్ ఎన్డీపీఎస్ కేసుల్లో 5,999 మంది పురుషులు, 312 మంది మహిళలు ఉన్నారు. 1,045 మంది ఖైదీలకు ఉచిత న్యాయ సలహా సేవలు అందించామ”ని ఆమె పేర్కొన్నారు. 2024 లో కోర్టు విచారణలో 30,153 కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 483 మందిని జైలు నుంచి విడుదల చేసినట్లు సౌమ్రా మిశ్రా తెలిపారు. 303 మందికి పెరోల్ ఇచ్చామని, ఈ-ములాఖత్ ద్వారా ఖైదీల కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించామన్నారు. 2,650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించామని, 12,650 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేపట్టామని డీజీ సౌమ్యా మిశ్రా అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News