Saturday, January 11, 2025
HomeTS జిల్లా వార్తలుమహబూబ్ నగర్Mahbubnagar: గాంధీ, అంబేద్కర్ ఆశయాలు కనుమరుగు చేసే కుట్ర

Mahbubnagar: గాంధీ, అంబేద్కర్ ఆశయాలు కనుమరుగు చేసే కుట్ర

పాదయాత్ర

ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీజీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల ఆశయాలు కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందని, వారి ఆశయాలు, ఆదర్శాలను అనుసరించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ పిలుపునిచ్చారు.

- Advertisement -

పాదయాత్ర ముగింపుకు అతిథిగా
శనివారం అచ్చంపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శివార్చక విజయ్ కుమార్ బాపు బాటలో సత్యశోధనా అనే కార్యక్రమం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాప్తంగా 100 రోజులపాటు 1000 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశం నిర్వహించే ప్రాంగణానికి పాదయాత్రతో వెళ్లారు. ఈ సందర్భంగా తుషార్ గాంధీ మాట్లాడుతూ వంద రోజులపాటు 1000 కిలోమీటర్ల మేరకు బాపు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు బాపు బాటలో సత్యశోధన యాత్రను నిర్వహించి నేటితరం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా కృషిచేసిన విజయ్ కుమార్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ప్రభుత్వాన్ని అభినందించిన తుషార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ, అంబేద్కర్ ల ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకువెళ్లడం చాలా సంతోషం అన్నారు. అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహనీయుల ఆదర్శాలను ముందుకు తీసుకు వెళ్తూ రాష్ట్రాన్ని విజయపతంలో నడిపించేందుకు కృషి చేస్తుందన్నారు. అచ్చంపేట పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసే మహాత్మా గాంధీ విగ్రహా ఆవిష్కరణకు తుషార్ గాంధీని ఆహ్వానించారు. మరోసారి నల్లమల్ల ప్రాంతాన్ని సందర్శించాలని ఎమ్మెల్యే సందర్భంగా కోరారు.


రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ
తాను 33 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఉద్యోగం చేసినప్పుడు కలగని అనుభూతి సంతోషం తాను ఈ 100 రోజుల్లో ప్రజల నుండి ఎంతో అనుభూతి సంతోషం లభించిందని అన్నారు. 1000 కిలోమీటర్ల పాదయాత్రలో అనేక విద్యాసంస్థలు 50,000 మంది విద్యార్థులు వేలాది మంది యువతి యువకులతో కలిసి మహాత్మా గాంధీజీ ఆశయాలను ఆదర్శాలను చర్చించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, గాంధీ స్మారక నిధి జాతీయ కార్యదర్శి సంజయ్ సింగ, టీ షాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి, తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్ష కార్యదర్శులు భూదానం సుబ్బారావు, కోదాటి రంగారావు, గాంధీ కింగ్ ఫౌండేషన్ సర్వోదయ ప్రసాద్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గున్న రాజేందర్ రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, పాదయాత్ర ఆహ్వానం కమిటీ కన్వీనర్ గార్లపాటి సుదర్శన్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు మరియు కౌన్సిలర్లు, పాదయాత్ర కోఆర్డినేటర్స్ డాక్టర్ మురళీధర్, అబ్దుల్ హక్, నాగం రఘురాం రెడ్డి, అబ్దుల్ రహమాన్, భీంపల్లి శ్రీకాంత్, బడేసాబ్, ఎస్. శ్రీధర్, బ్రహ్మచారి, జీ.మురళీధర్ రావు, ఆర్యవైశ్య మహిళా సంఘ అధ్యక్షురాలు సౌజన్య, జిల్లా నాటక సమాజాల సమైక్య అధ్యక్షులు ఆర్. సత్యం మరియు గాంధేయవాదులు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, చందా లింగయ్య, స్వామినాథన్, ఈదర గోపీచంద్, రామానుజ స్వామి, సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News