Saturday, January 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Bhargav: విశాఖ సెంట్రల్ జైలుకు ఫన్ బకెట్ భార్గవ్..!

Bhargav: విశాఖ సెంట్రల్ జైలుకు ఫన్ బకెట్ భార్గవ్..!

బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో యూట్యూబర్, ఫన్ బకెట్ ‌భార్గవ్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా భార్గవ్ ను పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
తనతో పాటు నటించిన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని మొదట భార్గవ్ పై కేసు నమోదు కాగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికపై లైంగిక దాడి చేసినట్లు నిర్ధారించి అరెస్ట్ చేశారు.

- Advertisement -

ఈ కేసులో మొత్తం 25 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ఇక కోర్టులో 17 మంది సాక్ష్యం చెప్పారు. అనంతరం కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు తీర్పుపై పోక్సో కోర్టు స్పెషల్‌ పీపీ మూర్తి మాట్లాడుతూ.. బార్గవ్ అప్పీల్‌కివెళ్లినా ఐదేళ్లపాటు పైకోర్టు స్వీకరించదని తెలిపారు.

అయితే కోర్టు తీర్పు తో ఈ రోజు మధ్యాహ్నం.. బార్గవ్ కు వైద్య పరిక్షలు నిర్వహించిన అనంతరం విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇటీవల కాలంలో చాలా మంది కష్టపడి మంచి ఫేమ్ తెచ్చుకొని.. దానిని నిలబెట్టుకోలేక పోతున్నారని ఈ సందర్భంగా నిపుణులు అంటున్నారు. కెరియర్ లో ఎదుగుతున్న కొద్ది ఇంకా జాగ్రత్తగా ఉండాలని.. ఏ తప్పు చేసినా శిక్షలు తప్పవని అంటున్నారు. దీనికి నిదర్శనం ఫన్ బకెట్ భార్గవేనని చెపుతున్నారు. మంచి పేరు తెచ్చుకున్నా.. చిన్న బుద్ధి ఉంటే ఏమవుతుందో ఈ ఘటన చెపుతోందని విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News