ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం లో భాగంగానే MLC కవితకు ఈడీ నోటీస్ జారీ చేసిందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలను చైత్యవంతులను చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోవడానికి కేంద్రం ఈడీ ద్వారా నోటీస్ ఇప్పించింది అని క్రాంతి కిరణ్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఇచ్చిన నోటీసులు కావంటూ కవితకు ఇచ్చిన నోటీసులపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ దురుద్ధేశం తోటే కవితకు నోటుసులని, ఢిల్లీలో ఆప్, ఇక్కడ బిఆర్యస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే ఇదంతా అన్న ఆయన.. ఇటువంటి పప్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉడకవన్నారు.
ఇటు మహిళా రిజర్వేషన్లపై తన పోరాటం కొనసాగుతుందని కవిత స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.