విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమను మళ్లీ నిలబెట్టేందుకు.. రూ.11,500 కోట్లతో భారీ ప్యాకేజీని ఆమోదం తెలిపింది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఈ ప్యాకేజీని వినియోగించనున్నారు. తాజా ఉద్దీపన ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఈ ప్యాకేజీని వినియోగించనున్నారు. తాజా ఉద్దీపన ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది. కేంద్రం పెద్దలను కలిసిన ప్రతిసారి ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావన తెస్తూ, ప్లాంట్ ను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి ఫలితం దక్కడంతో విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ప్రధాని మోదీ విశాఖ రాగా, ఆ సభలో విశాఖ ప్లాంట్ పై ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎవరూ.. ఉక్కు పరిశ్రమపై కనీసం మాట్లాడలేదు. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఖాయమన్న వాదనలు వినిపించాయి. అయితే తాజాగా కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.