నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న ‘తండేల్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతర్జాతీయ జలాల్లో పాకిస్తాన్ దళాలకు చిక్కుకున్న శ్రీకాకుళంలోని ఒక జాలరి గురించిన యాక్షన్ డ్రామా. ఇప్పటికే వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ సినిమా ప్రేమికుల మనసు గెలుచుకుంది. అంతేకాకుండా ఇటీవల రిలీజ్ అయిన నమో నమః శివాయ సాంగ్ కుడా అందరి ఊహాగానాలను పెంచింది. అయితే తాజాగా చిత్రం బృంధం నుంచి కీలక అప్‌డేట్ రేపు రాబోతుంది. సినిమా గురించి రేపు మరో అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమా పోస్టర్‌లో మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా ఆ పోస్టర్‌లో సర్వింగ్ సమ్‌తింగ్ డెలీషియస్ అని రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. అయితే అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తండల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకులను అలరించడానికి రానుంది.
Tandel Movie Update: తండేల్ సినిమా నుంచి మరో అప్‌డేట్.. రేపే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES