గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోగా, దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే మూవీ విడుదల రోజే మూవీ యూనిట్‌కి భారీ షాక్ తగిలింది. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా హెచ్‌డీ ప్రింట్ సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లోని టీవీల్లో మూవీని ప్రదర్శించారు.
ఈ క్రమంలోనే గాజువాకలోని ఓ లోకల్ టీవీ ఛానల్‌లో మూవీని ప్రసారం చేయడం తీవ్ర సంచలన సృష్టించింది. దీనిపై సీరియస్ అయిన మూవీ యూనిట్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు టీవీ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.