కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలోని ట్రస్టులకు ఏకంగా రూ.6 కోట్ల విరాళం అందించారు. వీటిలో ఎస్వీబీసీ(SVBC) ఛానల్‌కి రూ.5కోట్లు, శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళంగా ప్రకటించారు. ఈమేరకు విరాళం చెక్కులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆయన అందజేశారు. కాగా వర్ధమాన్ జైన్ కుటుంబం గతంలోనూ టీటీడీకి భారీ విరాళాలు ఇచ్చింది.
Tirumala: తిరుమల శ్రీవారికి రూ.6 కోట్ల భారీ విరాళం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES