రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన ఓ నదిలో పడవ ప్రయాణం చేశారు. ఫెర్రీలో ప్రయాణిస్తూ నది పునరుజ్జీవం, నీటి నిర్వహణపై ఆ దేశ ప్రభుత్వం అనుసరించిన విధానాలను పరిశీలించారు. అలాగే నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించిన పద్ధతులు నిపుణులను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ పర్యటనలో భాగంగా తాజాగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం భేటీ అయ్యింది. హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేర భారీ ఐటీ పార్కు నిర్మించనుంది. ఈమేరకు ఆ సంస్థ ప్రతినిధులతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇక రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ స్థాపించేందుకు ఎంవోయూ(MOU) చేసుకుంది.