యూజర్లకు ఊరట కలిగేలా ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్(Airtel) గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వాయిస్, మెసేజ్‌ల కోసం తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.
రూ. 499 రీఛార్జ్ ప్లాన్‌ను రూ. 30 తగ్గిస్తూ రూ. 469గా మార్చింది. ఈ ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ అండ్ రోమింగ్స్ కాల్స్ పొందొచ్చు. 900 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్ సహా హలో ట్యూన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
ఇక రూ. 1959 ప్లాన్‌పై రూ. 110 తగ్గించి రూ. 1849తో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్ఎంఎస్లు లబిస్తాయి. సంవత్సరం పాటు అపోలో సర్కిల్, హలో ట్యూన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
కాగా ఇటీవల కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో టెలికాం కంపెనీలు డేటా లేకుండా కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి.